21 July, 2026 | 11:22 AM

మహిళాసంఘం నూతన భవనానికి భూమి పూజ

21-07-2026 12:00 AM

అయిజ, జులై 20:  అయిజ మండలంలోని కిష్టాపురం గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ కుమ్మరి జయమ్మ ఆధ్వర్యంలో సోమవారం మహిళా సంఘం నూతన భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయిజ ఎంపీడీవో భాస్కర్ యాదవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల నుండి  మంజూరైన  రూ 10 లక్షలతో నిర్మించ తలపెట్టామని మహిళా సాధికారిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మహిళా అభివృద్దే ముఖ్యంగా భావిస్తూ మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు . ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ ప్రశాంత్, ఎంపీ ఓ మనోహర్, ఆర్ ఐ భరత్,సెక్రెటరీ తులసి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.