calender_icon.png 26 May, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుండి సర్వేయర్లకు శిక్షణ

25-05-2025 08:16:46 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ లో ఎంపిక ఎంపిక చేసిన 390 మంది సర్వేయర్లలో 203 మందికి తొలి విడతగా ఈనెల 26 నుండి జూలై 26 వరకు 50 రోజుల పాటు జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ ఏ. నరసింహమూర్తి(District Land Survey Assistant Director Narasimha Murthy) తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని, అలాగే క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా నిర్వహించి సర్వేలో వారికి అవసరమైన తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. నూతన భూభారతి ఆర్ఓఆర్ చట్టం 2025 పటిష్టంగా అమలు చేయడానికి సర్వేయర్లకు శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. శిక్షణకు ఎంపికైన సర్వేయర్లు తప్పకుండా శిక్షణకు హాజరుకావాలని కోరారు.