23-02-2026 04:36:55 PM
వాంకిడి,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా అమలవుతున్న టీబి ముక్త్ భారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా సమగ్ర సర్వే నిర్వహణపై వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నియంత్రణ అధికారి డాక్టర్ వినయ్ ఉప్రే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలకు సర్వే విధానం, కేసుల గుర్తింపు, నివేదికల నిర్వహణపై వివరణాత్మకంగా సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ పవన్ కుమార్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం ద్వారా టీబి వ్యాధిని ప్రారంభ దశలోనే అదుపులోకి తేవచ్చన్నారు. ఆరోగ్య విస్తరణ అధికారి రవిదాస్ సిబ్బందికి ఫీల్డ్ స్థాయి సమస్యలు, పరిష్కార మార్గాలను వివరించారు. కార్యక్రమంలో (ఎస్‌టిఎస్) సిబ్బంది తిరుపతి తదితరులు పాల్గొన్నారు.