21 August, 2026 | 7:30 PM

రైతులకు శిక్షణ

21-08-2026 06:51 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో ఆత్మ(ATMA )ఆధ్వర్యంలో రైతులకు  సాంకేతిక పరిజ్ఞానం -వ్యవసాయంలో ఆప్ ల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల శ్రేయస్సు కోసం అనేక పథకాలను,శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నాయన్నారు. రైతులందరూ వ్యవసాయ అధికారులు అనుబంధ శాఖల అధికారులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ, పెట్టుబడి తగ్గించుకొని అధిక దిగుబడులు పొంది ఆర్థిక సుస్థిరత సాధించాలని తెలిపారు.

కాసిపేట వ్యవసాయ అధికారి సిహెచ్. ప్రభాకర్ నూతన ఎరువుల బుకింగ్ యాప్ FFS ను గురించి రైతులకు వివరించారు. బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ రైతులకు వాతావరణ యాప్ గురించి చీడపీడలను గుర్తించే యాప్ గురించి వివరించారు. బెల్లంపల్లి ADA రాజానరేందర్ మాట్లాడుతు రైతులు యాప్ లను ఇన్స్టాల్ చేసుకుని ఎప్పటికప్పుడు మార్కెటింగ్ వివరాలు తెలుసుకున్నారు.వాతావరణ వివరాలు,వర్షపాతం సూచనలు ఇతర సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని రైతులు నేరుగా వారి మొబైల్లో తెలుసుకొని దానికి అనుగుణంగా వారి వ్యవసాయ పనులను ప్రణాళిక చేసుకోవాల్సిందిగా సూచించారు.

పి.ఎ. సి.ఎస్ చైర్మన్ చింతo స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు ఎల్లప్పుడూ కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతూ రైతులు ఎరువుల కోసం క్యూ లో నిలబడే బాధను తగ్గించడానికి యూరియా బుకింగ్ ఆప్ తీసుకు వచ్చిందనితెలిపారు. ఆ యాప్ ద్వారా చాలామంది రైతులు లబ్ధి పొందారని, దీన్ని మెచ్చిన కేంద్ర ప్రభుత్వం దేశమంతట FFS అప్ తీసుకొచిందని పేర్కొ న్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొత్త యాప్ ను కూడా రైతులు వినియోగిస్తున్నారని తెలిపారు. త్వరలో మంచిర్యాలకు కూడా కొత్త FFS ఆప్ రాబోతుందని, రైతులందరూ సిద్ధంగా ఉండాలన్నారు.