21 August, 2026 | 7:30 PM

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం పూజలు

21-08-2026 06:53 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం పూజలు ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రావణమాస శుక్రవారం కావడంతో వేద పండితులతో వరలక్ష్మి వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజా సంకల్పము, గణపతి పూజ, అష్టోత్తర శతమావళితో వరలక్ష్మి పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక నిష్ఠతో పూజ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.