మల్టీ జోన్-1 పరిధిలో ఎనిమిది మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ
12-06-2026 07:44 PM
మంథని,(విజయక్రాంతి): మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న ఎనిమిది మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ బదిలీలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
బదిలీల వివరాలు
- ఆసిఫాబాద్ సిసిఎస్ నుండి బుద్దే స్వామి మంథని సర్కిల్‌కు బదిలీ అయ్యారు.
- మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు ఐజిపి కార్యాలయానికి బదిలీ అయ్యారు.
- ఖమ్మం సిఎస్‌బి నుండి ఎల్లయ్య అశ్వాపురానికి బదిలీ అయ్యారు.
- అశ్వాపురం నుండి అశోక్ ఖమ్మం సిఎస్‌బికి బదిలీ అయ్యారు.
- వేణుచందర్ మంచిర్యాల ట్రాఫిక్ నుండి రామగుండం సిఎస్‌బికి బదిలీ,
- హన్నాన్ రామగుండం సిఎస్‌బి నుండి మంచిర్యాల ట్రాఫిక్‌కు బదిలీ,
- కృష్ణమూర్తి మెదక్ సిసిఎస్ నుండి మెదక్ రూరల్ సర్కిల్‌కు బదిలీ,
- జార్జ్ మెదక్ రూరల్ నుండి ఐజిపి కార్యాలయానికి బదిలీ అయ్యారు.
వీరిని వెంటనే రిలీవ్ అయ్యి కొత్త బాధ్యతల్లో చేరవలసిందిగా ఐజిపి ఆదేశాల్లో పేర్కొన్నారు.






