తొమ్మిది మంది ఐఏఎస్‌ల బదిలీ
గనుల శాఖ డైరెక్టర్‌గా సురేంద్ర మోహన్
వక్ఫ్ బోర్డు సీఈఓగా అసదుల్లా
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో 9మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ ఐఏఎస్ కె.సురేంద్ర మోహన్‌కు గనుల శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఆయన మైన్స్, జియాలజీ, ఐ,సీ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా ఉన్నారు. మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ సెక్రటరీగా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్‌ను తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. హెచ్‌ఎం,ఎఫ్‌డబ్ల్యూ జాయింట్ సెక్రటరీగా ఉన్న టి.వినయ్ కృష్ణా రెడ్డికి భూసేకరణ, పునరావాస కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ స్థానంలో ఇప్పటివరకు అదనపు బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ బొజ్జా రిలీవ్ అయ్యారు. తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ,ఎండీగా ఉన్న అయేషాను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. హార్టికల్చర్, సెరీకల్చర్ డైరెక్టర్‌గా ఉన్న ఎస్‌కే యాస్మిన్ బాషాను మైనార్టీస్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. డబ్ల్యూసీడీ, ఎస్‌సీ డైరెక్టర్‌గా ఉన్న నిర్మల కాంతి వెస్లేకు తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ, ఎండీగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.
ములుగు అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న పి.శ్రీజ.. ఖమ్మం అడిషనల్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. హెచ్‌ఎండీఏ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎండీ అసదుల్లాహ్‌కు వక్ఫ్ బోర్డు సీఈఓగా బాధ్యతలు అప్పగించారు. ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఉన్న జి.మల్సూర్‌కు తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.






