దంచికొట్టిన వాన
- జడ్చర్ల 100 పడకల ఆసుపత్రి చుట్టూ చేరిన వర్షపునీరు
- జలదిగ్బంధంలో పలు గ్రామాలు, నిలిచిన రాకపోకలు
- పిడుగుపడి తెగిన విద్యుత్ తీగలు.. కరెంట్ షాక్‌తో యువతి మృతి
- సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
- చెరువులు, కుంటలకు జళకల
- మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
- పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జడ్చర్లలోని 100 పడకల ఆసుపత్రి చుట్టూ వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో రోగులు, వారి సహాయకులు బయటకు, లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఉమామహేశ్వరం ఆలయం వద్ద ఎత్తున కొండల నుంచి ప్రమాదకర స్థాయిలో నీరు జాలువారుతున్నది. కామారెడ్డి జిల్లాలో చెట్టుపై పిడుగుపడటంతో విద్యుత్ తీగలు తెగి ఓ ఇంటి రేకులపై పడ్డాయి. దీంతో విద్యుత్ షాక్‌కు గురై విద్యార్థిని మృతి చెందింది. సింగరేణికి సంబంధించిన జేవీఆర్ ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలోనూ జోరు వర్షం కురిసింది. కాగా మరో మూడు రోజుల రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో..
నాగర్‌కర్నూల్(విజయక్రాంతి): జిల్లా లో ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షం కు రుస్తోంది. జిల్లా కేంద్రంలో చెరువులు, కుంటలు, నాళాలను కబ్జా చేసి నిర్మాణా లు చేపట్టడంతో వర్షపు నీరంతా రోడ్లపైనే పారింది. కొంతమంది ఇళ్లల్లోకి వర్షపు నీ రు చేరింది. జిల్లా వ్యాప్తంగా 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని గ్రామా లు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. భారీ వృక్షాలు రోడ పై విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉమామహేశ్వరం ఆలయంలో ఎత్తున కొండల నుంచి ప్రమా దకరస్థాయిలో జలపాతం జాలువారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నాగర్‌కర్నూల్ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
మత్తడిపోస్తున్న పాకాల, బయ్యారం..
హనుమకొండ(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో బయ్యారం, కొత్తగూడ, గూడూ రు మండలాల్లోని చెరువులు జలకళను స ంతరించుకుంటున్నాయి. మహబూబాబాద్‌లోని మున్నేరువాగులోకి భారీగా వరదనీరు చేరుతున్నది. గార్ల మండలంలోని పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బయ్యారం చెరువు మత్తడి దూకుతున్నది. గార్ల రాం పురం, మద్దివంచ తో పాటు సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంతో పాటు దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొం డ, ఖానాపూర్ మండలాల్లోని వాగులు, వం కలు పొంగిపొర్లుతున్నాయి. మాదన్నపేట, పాకాల చెరువులోకి భారీగా వరదనీరు చేరడంతో మత్తడి పోస్తున్నాయి. పాకాల వాగు వైపు పర్యాటకులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. హనుమకొండ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో
మహబూబ్‌నగర్(విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండ కురిసిన వర్షంతో జడ్చర్ల ని యోజకవర్గంలోని 100 పడకల ఆసుపత్రి చుట్టూ వర్షపు నీరు నిలిచింది. దీంతో రోగు లు, వారి సహాయకులు బయటకు, లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. కురుస్తున్న వర్షాలతో జనం ఇండ్ల నుంచి బయ టకు రావడంలేదు. జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి కొంత మేరకు నీరు వచ్చి ంది. జిల్లా వ్యాప్తంగా 5.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఆసిఫాబాద్ జిల్లాలో
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలో కురిసిన వర్షానికి చింతలమానేపల్లి మండలంలోని కేతిని, దిందా గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగి ప్రవహిస్తున్నది. కాగజ్‌నగర్‌లో భారీ వర్షం కురువడంతో రోడ్డుపై వరద నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కౌటాల, పెంచికల్‌పేట్, బెజ్జుర్, సిర్పూర్, లింగాపూర్, జైనూర్ మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జిల్లాకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ జోన్ ప్రకటించింది.
కామారెడ్డి జిల్లాలో
కామారెడ్డి(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలం నాచుపల్లిలో శనివారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు కొమ్మలపై ఉన్న విద్యుత్ తీ గలు తెగి సమీపంలోని రేకుల ఇంటిపై పడ్డా యి. రేకులకు ఆనుకుని ఉన్న ఇంటి తలుపులను స్వాతి(18) అనే యువతి ముట్టుకో వడంతో షాక్‌కు గురై మృతిచెందింఇ.
మెదక్ జిల్లాలో
మెదక్(విజయక్రాంతి): శనివారం ఉద యం నుంచి జిల్లా వ్యాప్తంగా ముసురుతో కూడిన వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమైనప్పటికీ జిల్లాలో భారీ వర్షాలు కురవలేదు. జిల్లాలో 45.9 మి.మీటర్ల సాధారణ వర్షం కురవగా, జిల్లా వ్యాప్తంగా 2.2 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
వికారాబాద్ జిల్లాలో
వికారాబాద్(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో వాగు లు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారా బాద్ పట్టణంలోని శివసాగర్ చెరువు నిండి, అలుగు పారుతున్నది. గిరిగెట్ పల్లి వాగు, సర్పన్ టపల్లివాగు, దోర్నాల్ వాగు, బంట్వా రం నూర్లపూర్ వాగు, కుర్కచర్ల రాంనగర్ వాగుతో పాటు ముసి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
యాదాద్రి జిల్లాలో
యాదాద్రిభువనగిరి: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి ముసుర్తు కమ్ముకు న్నాయి. మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మ కూరు(ఎం), రామన్నపేట, పోచంపల్లి, గుం డాల మండలాల్లో భారీ వర్షం కురిసిం ది. అడ్డగూడూరులో దాదాపు 10 సెం.మీ., మో త్కూరులో 4 సెం.మీ., రామన్నపేటలో 3.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. యాదగిరి గుట్ట పట్టణంలో బీసీ కాలనీ రోడ్లు జలమ యమయ్యాయి. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం లో భక్తులు రద్దీ వర్షం కారణంగా ఇబ్బం దులు పడ్డారు.
కోదాడ వద్ద నిలిచిపోయి వాహనాలు
హైదరాబాద్ మార్గంలోని నందిగామ వద్ద వాగు పొంగి రోడ్డుపై ప్రవహించింది. దీంతో కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాల ను ఖమ్మం నుంచి దారి మళ్లించారు.
కంట్రోల్ రూంల ఏర్పాటు
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉ ందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన దరిమిలా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి, అధికారులకు పలు సూచనలు చేశా రు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమ త్తం చేయాలని, లో లెవెల్ కల్వర్టులు, నీరు చేరిన రహదారులు దాటకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పశువులను మేతకు బయటకు పంపకుండా ఇంటివద్దనే ఉంచాలని, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వ్యవసాయ పనులకు వెళ్లొద్దని రైతులకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గమనించి అందులో ఉన్న వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలన్నారు.
వరద గుప్పెట్లో ఖమ్మం జిల్లా
ఖమ్మం(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంక లు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఖ మ్మం నగరంలోని ప్రధాన రోడ్లు వాగులను తలపించాయి. రోడ్లపై రెండు అడుగు లకు పైగా నీరు ప్రవహించడం గమనార్హం. బొక్కలగడ్డ, కరుణగిరి లోతట్టు ప్రాంతాలు, మున్నేరు పరివాహాక ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. కమాన్‌బజార్, మయూరీసెంటర్, కస్బాబజర్, కాల్వొడ్డు ప్రాంతాలు జలమయమయ్యా. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరింది. జిల్లాలో 176మి.మీ. వర్షపాతం నమోదైంది.
సత్తుపల్లి ఏరియాలో భారీ వర్షాల వల్ల సింగరేణికి సంబంధించిన జేవీఆర్ ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల్లోకి నీరు చేరి, బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కరుణగిరి ఏరియాలో ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఖమ్మెేంబోనకల్ మార్గంలో వాగుపై బ్రిడ్జి నిర్మిస్తుండట ంతో పక్కనే ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు నీట మునిగింది. తల్లాడ మండలం మిట్టపల్లి మధ్యలో వాగు ప్రవహి ంచడంతో రాకపోకలు నిలిచిపోయాయి.






