calender_icon.png 24 June, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీ సర్వీస్ ని లెక్కించాలి: ఐఎన్టీయూసి

23-06-2025 08:15:24 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): గ్రాట్యుటీ లెక్కించేటప్పుడు కార్మికుని బదిలీ సర్వీస్ ని కూడా పరిగణలోకి తీసుకొని లెక్కించాలని కోరుతూ ఐటిసిపిఎస్పిడి యాజమాన్యానికి, గుర్తింపు సంఘానికి ఐఎన్టియుసి(INTUC) మిత్రపక్షాల ఆధ్వర్యంలో సోమవారం మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎన్టియుసి మిత్రపక్షాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు గోనే రామారావు, యారం పిచ్చిరెడ్డిలు మాట్లాడుతూ... ఎంప్లాయి సర్వీసు గ్రాడ్యుటీ లెక్కించేటప్పుడు యాజమాన్యం కేవలం ఎంప్లాయి సర్వీస్ ని లెక్కిచకుండా అతని బదిలీ సర్వీస్ ని కూడా గ్రాట్యూటీ లెక్కించేయవలసిందిగా బదిలీ సర్వీస్ లెక్కించకపోవడం వల్ల సుమారు రెండు లక్షల 50 వేల రూపాయలు నష్టపోతున్నట్లు తెలిపారు. దీనివలన భవిష్యత్తులో కూడా వందల మంది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, బదిలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.