2 July, 2026 | 10:02 PM

వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలు!

03-12-2024 02:06 AM

హైదరాబాద్, డిసెంబర్2(విజయ క్రాంతి): వాణిజ్య పన్నుల శాఖలో పలువురు సీనియర్ అధికారులను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. హెడ్డాఫీస్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు కమి షనర్‌గా ఉన్న సాయికిశోర్, లీగల్ విభాగం అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరావును పంచాయతీరాజ్ రూరల్ డెవప్‌మెంట్ విభాగానికి బదిలీ చేసినట్లు సమాచారం.

బేగంపేట డివిజన్‌లో జేసీగా పనిచేస్తున్న శశిధర్‌ను వరంగల్‌కు పంపగా.. ఆ స్థానంలో మరో జేసీ రూపసౌమ్యను నియమించినట్లు విశ్వనీయవర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ జేసీ ఏడుకొండలును హైదరాబాద్ పంజాగుట్టకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట డివిజన్‌లో జేసీ గా పనిచేస్తున్న దీపారెడ్డితో హెడ్డాఫీస్‌లో సాయికిశోర్ స్థానాన్ని భర్తీ చేసి నట్టు సమాచారం. ఉత్తర్వులు ఇంకా వెలువడకపోయినా.. ఈ బదిలీలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.