మహిళా సాధికారతే లక్ష్యం
ఎమ్మెల్యే బాలూనాయక్
నల్లగొండ, డిసెంబర్ 2 (విజయక్రాంతి): మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలో సోమవారం జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల్లో స్త్రీనిధి, బ్యాంకు లింకేజి, వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా శక్తి పథకాల కింద లబ్ధిదారులకు రూ. 140 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.
పురుషులకు దీటుగా అన్నిరంగాల్లో రాణించేందుకు మహిళలు కృషి చేయాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల్లోని సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లను కేటాయించిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. నల్లగొండలో పెం డింగ్ సాగునీటిని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి శక్తి వంచన లేకుం డా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.






