7 May, 2026 | 2:31 AM

హమాలీలు సమస్యలను పట్టించుకోండి: ఎంపీ ఈటల

07-05-2026 01:49 AM

సికింద్రాబాద్, మే 6 (విజయక్రాంతి): పాలకులు వస్తారు.. పోతారు.. కానీ ఇక్కడ ఉండేది హమాలీలు, రైతులు, వ్యాపారులేనని వారు సంతృప్తిగా ఉండేలా తక్షణమే చర్యలు చేపట్టాలని ఎంపీ ఈట ల రాజేందర్ అధికారులకు సూచించారు.  ‘పజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘రైతువారం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు, సెక్రటరీ వెంకటేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ.. ఇది ఏసియాలోనే అతిపెద్ద మార్కెట్. పండించిన పంట కళ్ళముందే మట్టిపాలు, బురదపాలు అవుతున్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం, కాంటాలలో ధరలో మోసం లేకుండా చూడండి.

హమాలీల సమస్యలను కూడా పట్టించుకోండి. కార్యక్రమంలో బిజెపి నాయకులు భానుక మల్లికార్జున్, పిట్ల నగేష్ ముదిరాజ్, ఏనుగుల తిరుపతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు, సెక్రటరీ వెంకటేశం,సికింద్రాబాద్ విజిటేబుల్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ సభ్యులు దేవేందర్ రెడ్డి,మిరియాల శ్రీనివాస్, కే.శ్రీకాంత్ రెడ్డి,ఎస్.చంద్రరెడ్డి, సత్యనారాయణ,మార్కెట్ కమిటీ సభ్యులు ప్రభాకర్,రాము,అస్లాం,ఆకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.