6 May, 2026 | 2:27 AM

317జీవో బాధితుల బదిలీలు చేపట్టాలి

28-11-2024 02:14 AM

మంత్రి శ్రీధర్‌బాబుకు టీఆర్టీఎఫ్ విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): 317 జీవో బాధితుల బదిలీలు చేపట్టాలని మంత్రి శ్రీధర్‌బాబుకు టీఆర్టీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం సచివాలయంలో మంత్రిని కలిసి ఈమేరకు వినతి పత్రం అందజేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో నూతన పెన్షన్ విధానం అమలు నాటికి ముందే ఉద్యోగంలో నియమితులైన వారికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు.