ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
06-05-2026 02:26 AM
ఖమ్మం, మే 5 (విజయక్రాంతి): నెలవారి తనిఖీల్లో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గల ఈ.వి.ఎం. గోడౌన్ ను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గోడౌన్ రూం సీల్ ను పరిశీలించి, భద్రతా సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, భద్రతా సిబ్బంది షిఫ్టుల వారీగా డ్యూటీలో ఖచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. జిల్లా కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రాజు, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ అన్సారి, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.






