14 August, 2026 | 1:55 AM

సమస్యలు లేని విద్యాలయంగా తీర్చిదిద్దండి

14-08-2026 12:05 AM

దేవరకద్ర ఆగస్టు 13: సమస్యలు లేని విద్యలయంగా తీర్చిదిద్దుకుంటూ అడుగులు వేస్తే విద్యార్థులు మంచి వాతావరణంలో ఉన్నత శిఖరాలు చేరుకునే విద్యను పరిశిస్తారని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం మండల పరిధిలోని గురుకుల వ జూనియర్ కళాశాల, హాస్టల్ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు. హాస్టల్లో అందుతున్న సౌకర్యాలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలు, అవసరాలను తెలుసుకున్న అదనపు కలెక్టర్ వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ తనిఖీలో దేవరకద్ర ఎం.పి.ఓ, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.