2 June, 2026 | 8:33 PM

అశ్వారావుపేటలో 5 ట్రాన్స్‌ఫార్మర్లు ప్రారంభం

02-06-2026 08:02 PM

– రూ.30 లక్షలతో విద్యుత్ సమస్యకు పరిష్కారం

అశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జారే ఆదినారాయణ చేతుల మీదుగా, అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం రూ.30 లక్షల వ్యయంతో 5 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను మంగళవారం ఏర్పాటు చేశారు. మూడు 160KVA ట్రాన్స్‌ఫార్మర్లు రామాలయం వీధిలో ఒకటి, బీసీ హాస్టల్ ముందు, జంగారెడ్డిగూడెం రోడ్ లో ఒకటి, ఎస్బిఐ బ్యాంక్ దగ్గర, వినాయకపురం రోడ్లో ఒకటి, 100KVA అడిషనల్ ట్రాన్స్‌ఫార్మర్లు బిఎస్ఆర్ నగర్లో ఏఎస్ఆర్ నగర్లో ఒకటి ఏర్పాటు చేశారు. ఈ కొత్త ట్రాన్స్‌ఫార్మర్లతో పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో లో-వోల్టేజ్ సమస్య తొలగిపోయి, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని ఏ డి ఇ బి వెంకటరత్నం తెలిపారు.