పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

01-05-2024 12:41:05 AM

వరంగల్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటు న్నా మని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో మంగళవా రం విలేకరులతో మాట్లాడుతూ.. వరంగల్ స్థానం లో 42 మంది బరిలో ఉన్నారని తెలిపారు. 2024 ఏప్రిల్ 26న వెల్లడించిన తుది జాబి తా ప్రకారం పార్లమెంట్ పరిధిలో 18,24, 466 ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. పార్లమెంట్ పరిధిలో 247 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని వివరించారు. జనగామ, భూపాలపల్లి జిల్లా కేంద్రం, ఏనుమాముల మార్కెట్ యార్డులో ఎన్నికల సామగ్రి పంపి ణీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ.. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ శ్రీని వాస్, డీపీఆర్‌ఓ అయూబ్ అలీ, ఎన్నికల పర్యవేక్షకుడు విశ్వనారాయణ పాల్గొన్నారు.