పారదర్శకంగా జూనియర్ సానిటరీ ఇన్స్ స్పెక్టర్ పోస్టింగ్ వెబ్ కౌన్సిలింగ్
మంచిర్యాల,(విజయక్రాంతి): జూనియర్ సానిటరీ ఇన్స్ స్పెక్టర్ పోస్టింగ్ ఎంపిక కోసం సింగరేణి సంస్థ నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ సానిటరీ ఇన్స్పెక్టర్ ( గ్రేడ్ D) భర్తీ కోసం ఇంటర్నల్ విధానంలో నిర్వహించిన రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఎంపిక కోసం శనివారం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్పోరేట్ కార్యాలయంలో వెబ్ కౌన్సెలింగ్ లో ఒకరు పాల్గొనగా శ్రీరాంపూర్ ఏరియా నుంచి ఐదుగురు, ఆర్జీ 1 నుంచి ఒకరు, ఆర్జీ 2 నుంచి ఒకరు, మందమర్రి ఏరియా నుంచి ఒకరు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొన్నారు.
వెబ్ కౌన్సెలింగ్ లో పాల్గొన్న ఎనిమిది మంది అభ్యర్థులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తమకు అనుకూలమైన, అవకాశం ఉన్న ఏరియాలో పొస్టింగ్ ఎంచుకున్నారు. ఎవరైన పోస్టింగ్ తిరస్కరిస్తే మూడు ఏళ్ల వరకు అర్హత కోల్పోతారని ముందుగానే ప్రకటించారు. మొత్తం తొమ్మిది ఖాళీలలో తొమ్మిదికి తొమ్మిది పోస్టులను ఎంపిక చేసుకున్నారు. ఈ వెబ్ కౌన్సెలింగ్ శ్రీరాంపూర్ ఏరియా డీవైపీఎం రాజేష్, సీనియర్ పీఓ మురళి, ఐఈడీ ఇంజనీర్ సంగీత, సీనియర్ అసిస్టెంట్ నవీన్ ల ఆధ్వర్యంలో జరగగా రాత పరీక్ష మెరిట్ అభ్యర్థులు పాల్గొన్నారు.






