25 April, 2026 | 10:03 PM

ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో మౌళిక సదుపాయాలు కల్పిస్తాం

25-04-2026 08:53 PM

మునిసిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు

కోదాడ,(విజయక్రాంతి): ఎమ్మెల్యే పద్మావతి సహకారం తో అన్ని వార్డులకు మౌళిక సదుపాయాలు కల్పిస్తాం అని కోదాడ మున్సిపల్ ఛైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శని వారం కోదాడ మున్సిపల్ పరిధి లోని 31వ వార్డు లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కోదాడ పట్టణంలో దశల వారీగా అన్ని వార్డులకు సీసీ లు, డ్రైనేజీలు ఇతర వసతులు కల్పిస్తాం అన్నారు.

వార్డు కు సంబంధించిన ఏసమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్ ద్వారా నా దృష్టి కి తేవాలనీ ఆ సమస్య ను ఎమ్మెల్యే పద్మావతి గారి దృష్టి కి తీసుకెళ్ళి పరిష్కరిస్తామన్నారు. జిల్లా లో కోదాడ మున్సిపాలిటీ నీ అగ్ర స్థానంలో నిలుపుతాం అన్నారు. డ్రైనేజీ పనులు నాణ్యంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తిపిరి శెట్టి రాజు, ఖాసీం, మైలర శెట్టి భాస్కర్, లైటింగ్ ప్రసాద్ వార్డు ప్రజలు పాల్గొన్నారు.