6 July, 2026 | 2:24 PM

Breaking News

నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •  

ముడతలు తగ్గాలంటే!

07-05-2024 12:05 AM

ఈ మధ్య యవ్వనంగా కనబడాలనే శ్రద్ధ యువతలో విపరీతంగా పెరిగిపోయింది. ఆరోగ్యంగా, యవ్వ నంగా కనిపించాలంటే ఏం చేయాలి? మనం పాటించే జీవన విధానంలో కొన్ని అలవాట్లు మారిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, యవ్యనానికి యవ్వ నం దరిచేరుతుంది. యవ్వనంగా కనబడడానికి జీవనవిధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉదయం నడవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నడక హృదయాన్ని ఆరో గ్యంగా ఉంచడమే కాదు రక్తపోటును, మధుమేహాన్ని దరిచేరకుండా ఉంచుతుంది. దీని వల్ల యవ్వనంగా కనబడతాము. 

ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారంతో పాటు పండ్ల రసాలు తీసుకోవాలి. కాఫీ, టీ వంటి వాటికి దూరంగా ఉండ డం మంచిది.

ఆయుర్వేదంలో నెయ్యికి చాలా ప్రాధాన్యత ఉం టుంది. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు లు, మన చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. అంతేకాకుండా ముడతలను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.