19 June, 2026 | 4:33 PM

పవర్‌గూడలో రూ.3 లక్షలతో సవారి పీరీల షెడ్డు నిర్మాణం

19-06-2026 01:35 PM

మాజీ ఎమ్మెల్యే సక్కు కృషికి గిరిజనుల కృతజ్ఞతలు

జైనూర్, జూన్ 19 (విజయక్రాంతి): అసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పవర్‌గూడ గ్రామంలో సవారి పీరీల కోసం డీఎంఎఫ్‌టీ నిధులతో రూ.3 లక్షల వ్యయంతో నిర్మించిన షెడ్డు పనులు పూర్తయ్యాయని గ్రామ సర్పంచ్ తొడసం రాజేందర్ శుక్రవారం తెలిపారు. గతంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు మాజీ ఎమ్మెల్యే సక్కు నిధులు మంజూరు చేయించి షెడ్డు నిర్మాణానికి సహకరించారని సర్పంచ్ వివరించారు.

భక్తుల సౌకర్యార్థం ఈ షెడ్డును నిర్మించినట్లు పేర్కొన్నారు.షెడ్డు నిర్మాణం పూర్తికావడంతో గ్రామ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సర్పంచ్ తొడసం రాజేందర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి యువ సర్పంచ్ రాజేందర్ చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారని తెలిపారు. పంచాయతీ పరిధిలోని సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం సర్పంచ్ నిరంతరం కృషి చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి రాజేందర్ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని, ఆయన పనితీరును ప్రజలు కొనియాడుతున్నారని వెల్లడించారు.