మైనర్లు డ్రైవింగ్ చేస్తే సహించేది లేదు: సజ్జనార్ వార్నింగ్
మైనర్ డ్రైవింగ్ పై స్కూళ్లలో డీమెరిట్ పాయింట్ విధానం
హైదరాబాద్: విద్యాసంస్థల యాజమాన్యాలతో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం(Traffic Awareness Program) నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan) పాల్గొన్నారు. ఈ సందర్బంగా సజ్జనార్ మాట్లాడుతూ... మైనర్లు డ్రైవింగ్ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్, రాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ పై విద్య సంస్థల యాజమాన్యాలు దృష్టి పెట్టాలని సీపీ సూచించారు.
మైనర్ల డ్రైవింగ్(Minors Driving) పై స్కూళ్లల్లో డీమెరిట్ పాయింట్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. మైనర్లు పట్టుబడిన కేసుల్లో స్కూళ్ల పేర్లు పేర్కొనే పరిస్థితి తీసుకురావొద్దని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. విద్య సంస్థలకు కూడా చెడ్డ పేరు వస్తుందని సీపీ సజ్జనార్(CP Sajjanar warns) వివరించారు. స్కూళ్లు, బయట పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మైనర్లు స్మోకింగ్ అలవాటుబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.






