వానదేవుడు కరుణించాలని 44 గ్రామాల గిరిజనుల పూజలు
అడవిలో కొలువుదీరిన దేవుడికి మొక్కులు
ఉట్నూర్, జూలై 19 ( విజయక్రాంతి ): వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచిన వర్షాలు కోరేకపోవడంతో వాన దేవుడితోపాటు గజ్జల దేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని గిరిజనులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల పరిధిలోని 44 గ్రామాలకు చెందిన ఆదివాసి గోండు గిరిజనులు వాడ్ గగావ్,వాల్గొండ హీరపూర్ రెవిన్యూ గ్రామాల శివారులో కొలువుదీరిన ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దేవుడు గజ్జల దేవుడి దగ్గరికి చేరుకొని వర్షం కురిపించాలని,
పంటలు బాగా పండాలని కటోర దీక్షతో మొక్కులు చెల్లించుకున్నారు. తమ మొక్కులను మన్నించి వర్షాలు కురిపిస్తే మరోసారి ముక్కులు తీర్చుకుంటామని ఆదివాసి గిరిజనులు మొక్కులు చెల్లించుకున్నారు. గజ్జల దేవుడి పూజారులుకినక శంభు, ఆత్రం ధర్ము ల ఆధ్వర్యంలో 44 గ్రామాల పటేల్ ల తో ఆదివాసి గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవుడికి మొక్కులు తీర్చుకున్నారు.






