11-11-2025 12:06:05 AM
మహబూబ్ నగర్ టౌన్,నవంబర్ 10: ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ఆవరణలో కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో, భూత్పూర్ లోని వివేకానంద పాఠశాల తో పాటు పలు విద్యాసంస్థల్లో, కార్యాలయంలో ప్రముఖ కవి డాక్టర్ అందెశ్రీ ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతిని తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంత్యశ్రీ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా విద్యాసంస్థల అధ్యాపకులు, ప్రజాసంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు.