calender_icon.png 11 November, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం ఎండబెట్టే కల్లంగా మారిన రోడ్డు

11-11-2025 12:06:54 AM

నల్గొండ, నవంబర్ 10: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన స్థలం లేక రైతులు తెచ్చిన వరి ధాన్యాన్ని రోడ్లకు ఇరువైపులా ఆరబోస్తున్నారు. బీటీ రోడ్డుపై దాన్యం త్వరగా ఎండి మ్యాచర్ వస్తుందని భావిస్తున్న రైతులు రోడ్డుకు ఇరువైపులా వడ్లు ఆరబోస్తున్నారు ఇటీవల వర్షాలతో నేల పూర్తిగా తడి తో ఉండడంతో ధాన్యం త్వరగా మ్యాచర్ రావడం లేదు నల్గొండ నుండి ముష్యంపల్లి వెళ్లే రహదారిలో రైతులు ఇరువైపులా ధాన్యం ఆరవశారు పెద్దగా రద్దీ లేని రోడ్డు కావడంతో కళ్లాన్ని తలపించేలా రోడ్డు ధాన్యంతో నిండిపోయింది ధాన్యాన్ని తూర్పు ఆరా బెట్టడంతో వాహనదారుల కళ్ళల్లో దుమ్ము పడివాహనాలు అదుపు తప్పి పడి పోతున్నారు వాహనదారుల రాత్రి ప్రయాణం ప్రమాదకరంగా మారుతుంది పలు వా హనాలు ధాన్యం రాశుల పై నుంచి వెళ్లడం తో ఇటు రైతులకు అటు వాహనదారులకు ఇబ్బందిగా మారుతుంది.