కానిస్టేబుల్ రఘుకు నివాళి
11-06-2026 12:00 AM
గాంధారి, జూన్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోనీ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తు మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించిన రఘు ఫోటోకు బుధవారం నాడు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఘనంగా నివాళి అర్పించారు.
ఈ కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. డిపార్ట్మెంట్ రఘు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన వారికి భరోసాను ఇచ్చారు. ఆయన వెంట సదాశివ నగర్ సి.ఐ. సంతోష్ కుమార్, బాన్సువాడ సి.ఐ. శ్రీధర్, రూరల్ సి.ఐ. తిరుపతయ్య, గాంధారి ఎస్‌ఐ మహేందర్, సిబ్బంది ఉన్నారు.






