12 April, 2026 | 1:50 AM

మహాత్మా జ్యోతిరావ్ ఫూలేకు నివాళి

12-04-2026 12:22 AM

పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు

వరంగల్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావ్ పూఫూలే జయంతి సందర్భంగా శనివారం వరంగల్ నగరంలోని ములుగు రోడ్డులో ఉన్న ఫూలే విగ్రహానికి ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి, ప్రస్తుత శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, వరంగల్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్ పాయ్, 20డివిజన్ సీనియర్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, పీసీసీ డెలికేట్ మెంబర్ టైగర్ నల్లగొండ రమేష్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరవి పరమేష్, తోట హరీష్, గోరంటాల రాజు, వరంగల్ జిల్లా సోషల్ మీడియా కో -ఆర్డినేటర్ సోమ లక్ష్మి, సీనియర్ మహిళా స్టేట్ సెక్రటరీ నాయకురాలు పుష్ప, సిటీ మహిళా ప్రెసిడెంట్ నారగోని స్వప్న హాజరై పూలే సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావ్ పూలే సమాజంలో సమానత్వం, విద్యా ప్రాధాన్యత, మహిళల సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ,అధికారులు పాల్గొన్నారు.