19 April, 2026 | 5:01 PM

ఉగ్రదాడి మృతులకు నివాళి

25-04-2025 12:52 AM

కామారెడ్డి, ఏప్రిల్ 24,(విజయ క్రాంతి): పహల్ గామ్ ఉగ్ర వాదుల కాల్పులలో మరణించిన మృతులకు గురువారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది నివాళులు అర్పించారు.  భోజన విరామ సమయంలో ఎంపిడివో ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలసి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ఉగ్రవాదుల చర్య పాశవికమైనదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో ప్రవీణ్ కుమార్, పర్యవేక్షకులు మనోహర్ , సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు, పంచాయతీ కార్యదర్శి యాదగిరి సిబ్బంది పాల్గొన్నారు.