calender_icon.png 12 October, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఘన నివాళులు

12-10-2025 05:54:53 PM

ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం..

నకిరేకల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి దశదినకర్మకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావుతో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కలిసి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వీరితో పాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.