12-10-2025 05:45:56 PM
సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం..
నకిరేకల్ (విజయక్రాంతి): నవంబర్ 7, 8 తేదీల్లో రామన్నపేటలో జరిగే సీఐటీయు యాదాద్రి భువనగిరి జిల్లా 7వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. ఆదివారం రామన్నపేట మండలం కేంద్రంలో గొరిగే సోములు అధ్యక్షతన జరిగిన ఆసంఘం మండల కమిటి సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మాట్లాడుతూ కార్మిక పోరాటల సారధి సీఐటీయు యాదాద్రి భువనగిరి జిల్లా మహాసభలు రామన్నపేట మండల కేంద్రంలో వేదిక కానున్నాయని మహాసభసకు అన్ని వర్గాల కార్మిక లోకం హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని నూతన ఆర్థిక విధానాలతో అనునిత్యం శ్రమను దోచుకుంటు దోపిడీకి గూటి చేస్తున్నాయన్నారు.
శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలని కార్మికులను ఐక్యం చేస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో జరిగే కార్మిక పోరాటలకు అన్ని వర్గాల కార్మికులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. నాలుగు నూతన లేబర్ కొడ్లను రద్దు చేసి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కమిటి సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, బందెల బిక్షం, గ్రామపంచాయతి వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నకిరేకంటి రాము, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి వంగాల మారయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకురాలు బేక్కం జయమ్మ, ట్రాన్స్ పోర్ట్ యూనియన్ నాయకులు వడ్లకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.