16 April, 2026 | 10:43 AM

‘త్రివేణి’ కవితలు

29-12-2025 12:00 AM

కన్నీళ్లు రాలుతున్నాయి

జ్ఞాపకాలు ముంచేస్తున్నాయి

హృదయం మళ్లీ కరిగిపోతున్నది


ఇదో చూడు ప్రేమ లేఖ రాస్తున్నాను

కళ్లల్లో నీ రూపాన్నే చూస్తున్నాను

ఆశలు ఆనందంగా ఎగిరి పడుతున్నాయి


ఒంటరితనం నిండా కమ్మేస్తున్నది

రాత్రి నిశ్శబ్దంగా ఏడుస్తున్నది

మన చిన్నప్పటి స్నేహం గుర్తుకొస్తున్నది 


కలలు విరిగిపోతున్నాయి

విచారం హృదయాన్ని ముట్టడిస్తుంది

మళ్లీ ధైర్యం తప్పకుండా పుడుతున్నది


అమ్మ చేయి తాకుతుంది

మమతలు వ్యాపిస్థాయి

జీవితం మధురంగా మారుతున్నది


వాన చినుకులు టప టపా కురుస్తాయి

మట్టి వాసన వ్యాపించి గుబాలిస్తుంది

జీవితం మళ్లీ పచ్చగా మారుతున్నది


సూర్యుడు అస్తమిస్తున్నాడు

ఆకాశం ఎరుపెక్కుతున్నది

రాత్రి రహస్యాల్ని విప్పుతున్నది

పువ్వు వికసిస్తుంది

తుమ్మెద గుసగుసలాడుతున్నది

ప్రేమ తన పాట అందుకుంటున్నది


నది ప్రవహిస్తుంది 

కష్టాలు అన్నీ కొట్టుకుపోతాయి

ఆశలు ముందుకు సాగుతాయి


చంద్రుడు అందంగా నవ్వుతున్నాడు

నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి

కలలు మళ్లీ ఎగురుతున్నాయి !