calender_icon.png 10 January, 2026 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్‌లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు

06-01-2026 12:00:00 AM

సూర్యాపేట ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం

సూర్యాపేట, జనవరి 5 (విజయక్రాంతి) :  మైనర్ లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని మూడు సంవత్సరాల వరకు లైసెన్స్ రాదని డ్రంకన్ డ్రైవ్ లో దొరికితే జైలు పాలవతారని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం అన్నారు.

సోమవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026 లో భాగంగా పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కే.నరసింహ ఆదేశాల మేరకు ప్రతిరోజు రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026 నిర్వహిస్తున్నామన్నారు. త్రిబుల్ రైడింగ్ చేసి రోడ్డు యాక్సిడెంట్లకు పాల్పడవద్దని, రోడ్డు యాక్సిడెంట్ జరిగితే మీ కుటుంబం రోడ్డు మీద పడుతుందని, రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నిబంధనల ప్రకారం వాహనాలను నడపాలని అతివేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్లాలన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని కోరారు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదం నుంచి బయట పడవచ్చు అని సూచించారు.  ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.