1 June, 2026 | 8:02 PM

ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ

01-06-2026 07:32 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని జయలక్ష్మీ టాకీస్ సెంటర్ నందు తెలంగాణ రక్షణ సేన (TRS) ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ జాగృతి  అధ్యక్షుడు, డి వీరన్న ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డి వీరన్న మాట్లాడుతూ... మే 20వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు జరుగుతున్న జెండా పండుగలో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజా హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ రక్షణ సేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా తెలంగాణ రక్షణ సేన అశ్వరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్, లాయర్ సొడెం వెంకట్ మాట్లాడుతూ, జెండా పండుగ కార్యక్రమాలను గ్రామ గ్రామాన నిర్వహించి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని కోరారు.