టీఆర్‌ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్
బాధ్యతలు స్వీకరించిన సంజీవరావు నాయక్
కోదాడ, జూలై 28 :తెలంగాణ రక్షణ సేన పార్టీ కోదాడ నియోజకవర్గం ఇన్చార్జిగా భూక్య సంజీవరావు నాయక్ నియమితులయ్యారు. మంగళవారం పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నియామకం చేపట్టి ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
ఈ మేరకు పార్టీ అధిష్టానం నిర్ణ యం వెలువడిన వెంటనే కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టిన భూ క్య సంజీవరావు నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధినేత్రి కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ గడ్డపై పార్టీ అభివృద్ధికి ప్రజల సంక్షేమ కోసం నిరంతరం సైనికుడిలా పని చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ కళాశాల సీఈఓ సేకు శ్రీనివాసరావు, నియోజకవర్గ కన్వీనర్ ఏనుగుల యదేశ్వర్ రావు, మహిళా నాయకులు కంచేటి మమత, పూర్ణచంద్రరావు, పార్టీ నాయకులు చెడ పంగు ఉపేందర్, తోట శ్రీనివాసరావు, బాబు, బిక్షం నాయక్, బాలు, నాగేశ్వరరావు, మహిళా నాయకులు, శైలజ, జ్యోతి, చాందిని తదితరులు యువకులు పార్టీ కార్యకర్తలు పెద్దలు పాల్గొన్నారు.






