16-02-2026 01:01:28 AM
పాలమూరు కార్పొరేటర్ ను అభినందించిన టిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఎవరు ఎన్ని ప్రలోభాలకు చూసిన ఎట్టి పరిస్థితుల్లో లొంగకూడదని బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలమూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ గెలుపొందిన పార్టీ కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మల్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సమయంలో ప్రజలే ఈ విషయం చెప్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై పాలక పక్షాన్ని నిలదీయాలన్నారు. రెండు ఏండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందనిల్, ఎన్నికల సమయంలో మి డివిజన్ లలో ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామన్నారు. సిరిసిల్ల,సిద్దిపేటకు పోటీగా మహబూబ్ నగర్ ను శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి చేశారని, మిగిలిన పనులను ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి చేస్తామన్నారు.
వచ్చే ప్రభుత్వం లో శ్రీనివాస్ గౌడ్ మంచి స్థానంలో ఉంటారని, మి గెలుపు కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారని,శ్రీనివాస్ గౌడ్ కి అండగా మీరు నిలబడాలన్నారు. తక్కువ ఓట్లతో చాలా మంది కార్పొరేట్ అభ్యర్థులు ఓడిపోయారని, ఓడిపోయిన అభ్యర్థులకు భవిష్యత్ లో పార్టీ మంచి స్థానం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు నూతనంగా గెలిచిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.