16-02-2026 01:03:08 AM
మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిట లాడిన శైవ క్షేత్రాలు
సోమశిల కృష్ణ తీరంలో పుణ్యస్నానాలు
నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 15 (విజయక్రాంతి)/కొల్లాపూర్ రూరల్ నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొ ల్లాపూర్, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆది వారం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే దైవ క్షేత్రాల్లో దైవదర్శనం కోసం భారీగా క్యూలై న్లో బారులు తీరారు. అచ్చంపేటలోని ఉమామహేశ్వర ఆలయం, కొల్లాపూర్ మండలం సోమశిల సోమేశ్వర ఆలయంలో తెలంగాణ కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
కృష్ణ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకున్నారు. సోమశిలలో ఆలయ కమిటీ చైర్మన్ బీ గోవిందరెడ్డి భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ జాగరణ చేసే భక్తుల కోసం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ శివాలయం, భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకట్టలాడింది. అత్యధికంగా భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు.