29 May, 2026 | 7:59 PM

జండా గద్దెల ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి

29-05-2026 04:40 PM

గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ కు టిఆర్ఎస్ వినతి 

గజ్వేల్, మే 29: తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పటిష్ఠతలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో జెండా గద్దెల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం పార్టీ జెండా పండుగ జిల్లా ఇంచార్జి కొట్టాల యాదగిరి ముదిరాజ్ మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్‌కు దరఖాస్తు అందజేశారు. ఇందిరా పార్క్ చౌరస్తా, కోట మైసమ్మ ఆలయం, ప్రజ్ఞాపూర్ చౌరస్తా, ఆర్ అండ్ ఆర్ నిర్వాసిత కాలనీలో జెండా గద్దెల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గజ్వేల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకుడు లోక రవిచంద్ర, నాయకులు ఇంద్రాగౌడ్, నరేందర్ రెడ్డి, ఎడ్ల నర్సింలు, శ్రీకాంత్, ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు.