ట్రంప్ దేశద్రోహి!
- వైట్‌హౌస్ డిన్నర్ ఘటనలో ముందే నోట్ రాసుకున్న నిందితుడు
- నేను రేపిస్ట్‌ను కాను.. నిర్దోషిని అంటూ మీడియాతో ట్రంప్ అసహనం
వాషింగ్టన్, ఏప్రిల్ 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశద్రోహి అని, రేపిస్ట్ అని, అతన్ని వదులొద్దు అని వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల ఘటన పాల్పడిన నిందితుడు కోల్ టొమాస్ అలెన్ తన నోట్‌లో రాసుకున్నాడు. అతడు ట్రంప్‌నకు వ్యతిరేకంగా దాడికి ముందే ఓ నోట్‌ను తయారుచేసి, దానిని కుటుంబ సభ్యులకు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ నోట్ పై ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా ‘నేను రేపిస్ట్‌ను కాను.. నిర్దోషిని’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
కాల్పులకు పాల్పడిన నిందితుడు తన నోట్‌లో ట్రంప్ పిల్లలను లైంగికంగా వేధించే వ్యక్తి, రేపిస్ట్, ద్రోహి వంటి పదాలను రాసుకున్నాడని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘అలాంటి లక్షణాలున్న వ్యక్తిని ఏమాత్రం అంగీకరించనని నిందితుడు పేర్కొన్నాడు. అలాగే తాను ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నాడో కూడా ఒక జాబితాను సిద్ధం చేసుకు న్నాడు. తన జోలికి రానంతవరకు అతిథులు, ఇతర సిబ్బంది, సీక్రెట్ సర్వీస్ ఏజెం ట్లపైనా కాల్పులు జరపబోనని పేర్కొన్నాడు.
అలాగే హోటల్ భద్రత ఘోరంగా ఉందని, తాను భారీ రైఫిల్‌ను తెచ్చినా ఎవరూ గుర్తించేవారు కాదంటూ నిందితుడు వ్యాఖ్యానిం చాడు. ఇక కాల్పుల ఘటన అనంతరం అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. నోట్‌లో ఉన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ‘నిందితుడు రాసుకున్నది మీ గురించే అని భావిస్తున్నారా..?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. ‘అతడే దానిని రాసుకున్నాడు.
కానీ నేను రేపిస్ట్‌ను కాను. ఏమాత్రం సంబంధం లేనివాటిని నాకు ముడిపెట్టారు. నేను నిర్దోషిని’ అంటూ తనను ప్రశ్నించిన రిపోర్టర్‌పై అసహనం వ్యక్తంచేశారు. ప్రస్తుతం నిందితుడు రాసుకున్న అంశాలను అధికారులు పరిశీలిస్తు న్నారు. ట్రంప్ యంత్రాంగంలోని అధికారులను లక్ష్యంగా చేసుకోవాలని అతడు ప్రయత్నించినట్లు వెల్లడవుతోందని అధికారులు పేర్కొన్నారు.






