calender_icon.png 12 September, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంప్రదాయానికి భిన్నంగా ట్రంప్ ప్రమాణం

19-01-2025 01:24:05 AM

* రేపు క్యాపిటల్ భవనంలో ప్రమాణం చేయనున్న ట్రంప్

* 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

* ఉష్ణోగ్రతలు పడిపోవడమే కారణం

వాషింగ్టన్, జనవరి 18: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముమ్మరంగా ఏర్పా ట్లు జరుగుతున్నాయి. అయితే 40 ఏళ్ల తర్వాత సంప్రదాయానికి భిన్నంగా ట్రంప్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్‌లో ఉష్ణోగ్రతలు దారు ణంగా పడిపోతున్నాయి. ప్రమాణ స్వీకారం రోజున అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 12 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో తన ప్రమా ణ స్వీకారోత్సవాన్ని ఔట్‌డోర్‌లో కాకుండా యూ ఎస్ క్యాపిటల్ భవనంలోని రోటుండాలో నిర్వహించుకోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ట్రంప్ ప్రకటించారు. గడ్డకట్టే చలిలో ప్రజలను ఇబ్బందిపెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

40 ఏళ్ల క్రితం రొనాల్డ్ రీగన్ కూడా ఇదే విధంగా క్యాపిటల్ భవనంలోపల అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు ట్రం ప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే క్యా పిటల్ వన్ ఎరినాలో ఈ కార్యక్రమాన్ని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సోమవారం జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమల హ్యారీస్‌తోపాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ. బుష్, బరాక్ ఒబామా తదితరులు పాల్గొననున్నారు.