24-05-2025 12:00:00 AM
ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా
రాజేంద్రనగర్, మే 23: సర్కారు బడులపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెంచాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాన సూచించారు. శుక్రవారం అత్తాపూర్ డివిజన్ పరిధిలోని ఎడిఫై స్కూల్ లో ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ఎస్ ఇ సి ఆర్ ఈ టీ డైరెక్టర్ రమేష్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు తో కలిసి పర్యవేక్షించారు. కోర్సు డైరెక్టర్ శంకర్ రా థోడ్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం యోగితా రాణా మా ట్లాడుతూ.. న్యాస్ లో తెలంగాణ 36వ స్థా నం లో ఉందన్నారు. దాదాపు 60 శాతం పై గా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లోకి వెళ్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులపై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందని ఆ మె సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్ర భుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు.
ఈ శిక్షణ తర్వాత ఎన్రోల్మెంటులో స్పష్టమైన మార్పు కనపడాలని చెప్పారు. ఉపాధ్యాయులు దైవంతో స మానమన్నారు. మనం నాణ్యమైన విద్యను అందిస్తే విద్యార్థులు ప్రభుత్వ బడులకు వస్తారని పేర్కొన్నారు. శిక్షణ తీరుపై ఆమె తృప్తి వ్యక్తం చేశారు.