calender_icon.png 24 May, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆల

23-05-2025 11:14:36 PM

భూత్పూర్,(విజయక్రాంతి): భూత్పూర్ మండల పరిధిలోని లంబడి కుంట తండాలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ కమల మాన్య నాయక్ కూతురు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లంబాడి కుంట తండాలో ఆమె పార్తివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బాలకోటి, రాము రాథోడ్, బాల్ రెడ్డి తోపాటు తదితరులు ఉన్నారు.