16 June, 2026 | 9:54 PM

ట్రాన్స్ ఫార్మర్ల కోసం సబ్ స్టేషన్ వద్ద రైతుల ధర్నా

15-06-2024 11:30 AM

చిన్నమల్లారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని చిన్నమల్లారెడ్డి గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేస్తున్నారు. సబ్ స్టేషన్ వద్ద తిమ్మక్ పల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల కోసం రైతులు డీడీలు కట్టినట్లు తెలిపారు. డీడీలు కట్టి 3 నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెదక్- కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రైతులకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు.