15 March, 2026 | 5:59 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

టీటీడీలో రూ.54 కోట్ల స్కాం

11-12-2025 12:42 AM

కుంభకోణంపై ఏసీబీ విచారణకు టీటీడీ తీర్మానం

అమరావతి, డిసెంబర్ 10: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో వరుస కుంభకోణాలు బయటపడడం తో శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి సరఫరా వంటి ఘటనలు మరువక ముందే ఇప్పుడు పట్టు అంగవస్త్రాల కొనుగోళ్లలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీవారికి విరాళాలు ఇచ్చే దాతలు, వీఐపీలకు అందించే మల్బరీ పట్టు అంగవస్త్రాలకు బదులుగా, ఓ సంస్థ పదేళ్లుగా పాలిస్టర్ అం గవస్త్రాలను సరఫరా చేసినట్లు టీటీడీ విజిలెన్స్ తనిఖీల్లో తేలింది.

శ్రీవారిని దర్శించు కునే దాతలు, వీఐపీలకు రంగనాయకుల మండపంలో వేదా శీర్వచనం అందించి, పట్టు అంగవస్త్రంతో సత్కరించడం ఆనవాయితీ. పూర్తి సమాచారం ప్రకారం తిరుమల వేద ఆశీర్వాచనంలో భారీ మోసం బయటపడింది. ప్రముఖులకు ఇచ్చే పట్టు అంగవ స్త్రాల కొనుగోలులో స్కాం వెలుగులోకి వచ్చింది.రూ.100 విలువల చేయని ఒక నాసిరకం వస్త్రాన్ని దాదాపురూ.౧,౪౦౦కు సరఫరా చేసినట్లు బోర్డుకు టీటీడీ విజిలెన్స్ తెలిపింది.

2015 నుంచి 2025 వరకు ఇలా శ్రీవారి ఖజానా నుంచి దాదాపు రూ.54 కోట్లు దోచుకుంది. ఒకవైపు లడ్డు మరోవైపు పరకామణి కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో మరో భారీ మోసం బయటపడింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో కొన్ని వందల కోట్లు దోచుకుంటున్నారు. సిల్క్ కాత్‌ను పట్టు వస్త్రంగా చూ పించి కోట్లు దోచారు.    నగరికి చెందిన వీఆర్‌ఎస్ ఎక్స్‌పోర్ట్ అనే సంస్థ 2015 నుంచి టెండర్ దక్కించుకొని అంగవస్త్రాలు సరఫరా చేస్తోంది.

ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఈ అంగవస్త్రాల నాణ్యతపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.టెండర్ నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, నిర్దిష్టమైన బరువు, పరిమాణంలో అంగవస్త్రాలు నేయాలి. వాటిపై ’ఓం నమో వేంకటేశాయ’ అనే అక్షరాలతో పాటు శంకు, చక్ర నామా లు ఉండాలి. కానీ, సరఫరా అయిన శాలువాలు పూర్తి పాలిస్టర్‌తో ఉన్నాయని తేలిం ది.

కేవలం రూ.350 నుంచి రూ.400 విలు వ చేసే ఈ నాసిరకం అంగవస్త్రాలను ఒక్కొక్కటి రూ.1,400 చొప్పున టీటీడీకి విక్రయించి సంస్థ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.2015 నుంచి 2025 వరకు ఇలా 15,000 పట్టుతో కాకుం డా పాలిస్టర్‌తో తయారు చేసినవి సరఫరా చేసి శ్రీవారి ఖజానా నుంచి దాదాపు రూ.54 కోట్లు దోచుకుంది. ఈ అంగవస్త్రాల నమూనాలను బెంగళూరు, ధర్మవరంలోని సెంట్ర ల్ సిల్క్ బోర్డ్ ల్యాల్‌లకు పంపించగా, అవి పాలిస్టర్‌తో తయారైనవేనని నివేదికలు స్పష్టం చేశాయి.

ఈ కుంభకోణంపై పూర్తిస్థా యి విచారణ జరిపించాలని టీటీడీ పాలకమండలి తీర్మానం చేసింది. దీనిపై దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌ను కోరింది. గతంలో కాంచీపురంలోని ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు నమూనాలను మార్పిడి చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిసూ ్తసంబంధిత స్కామ్‌లో ఉన్న ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. దీనిపై ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించినట్లు తెలిపారు.ఈ కుంభకోణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైనా వివరణాత్మక దర్యాప్తు జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ను అభ్యర్థించడానికి ట్రస్ట్ బోర్డు ఒక తీర్మానాన్ని ఆమోదించిందని బీఆర్ నాయుడు తెలిపారు.