జమలాపురం సర్పంచ్‌గా తుళ్లూరు నిర్మలాకుమారి ఏకగ్రీవం
- ఏకగ్రీవంగా ఎన్నికైన తుళ్లూరు నిర్మలా కుమారి
- అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న జమలాపురం పంచాయతీ
- మండలంలోని ఆదర్శవంతమైన గ్రామంగా జమలాపురం
- గ్రామాభివృద్ధికి తుళ్లూరు కోటేశ్వరరావు నిర్మలాకుమారి దంపతుల ఎనలేని సేవలు..
ఎర్రుపాలెం డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలంలోని జమ లాపురం గ్రామ పంచాయతీ సర్పంచిగా తుళ్లూరు నిర్మలా కుమారిని ఏకగ్రీవంగా గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. గ్రామానికి చెందిన తుళ్లూరు నిర్మల కుమారి పోటీ చేయడంతో గ్రామంలోని ప్రజలు, గ్రామంలోని అన్ని రాజకీయ పక్షాలు ఈమెకు మద్దతును తెలిపాయి. పోటీ లేకుండా ఏకగ్రీ వంగా ఎన్నిక కావడంతో మండలంలోని ఆదర్శవంతమైన గ్రామంగా జమలాపురం గ్రామపంచాయతీ నిలుస్తోంది.
మండలంలోని గ్రామాలకు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో జమలాపురం జనరల్ స్థానానికి కేటాయించబడింది. జమలాపురం గ్రామస్తుల ముందుచూపుతో గ్రామానికి చెందిన తుళ్లూరు నిర్మల కుమారి పంచాయతీ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జమలాపురం పంచాయతీ అభ్యర్థిగా నామినేషన్ వేసినారు. పోటీగా ఎవరు పోటీ చే యకపోవడంతో ఏకగ్రీవ సర్పంచిగా ఎన్నుకున్నారు.
గ్రామానికి చెందిన తుళ్లూరు కో టేశ్వరరావు నిర్మలాకుమారి దంపతులు గ్రామాభివృద్ధికి పాల్పడుతూ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ గ్రామానికి తమ వంతు సహకారంగా ఎనలేని సేవలందిస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న ప్రతి అభి వృద్ధిలో శక్తి వంచన లేకుండా తమ సహా య సహకారాలు అందిస్తున్నారు. తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలా పురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి వీరు ఎనలేని కృషి చేస్తున్నారు. స్వామివారికి ప్రతిరోజు కళ్యాణాలు చేసేందుకు వకుల మాత స్టేడియం ను నిర్మించా రు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో, ప్రత్యేక పూజలు, స్వామివారి తెప్పోత్సవాలలో తమ సొంత నిధులను వెచ్చించి ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. సంవత్సరంలో జరగబోయే అన్ని పండుగలకు వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జమలాపురం దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పండగ పర్వది నాలలో భక్తులకు ఉచిత అన్నదానాలను నిర్వహిస్తున్నారు. జమలాపురం గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో వీరి భాగస్వామ్యం ఉంటుంది.
జమలాపురం గ్రామానికి చెందిన యువతకు అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ గ్రామ ప్రజల మన్నలను పొందడంతో వీరు ముందున్నారు. అందుకే గ్రామంలోని వారందరూ నిర్మలా కుమారుని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకొని మండలంలో ఆదర్శవంతమైన గ్రామంగా జమలాపురంను ఉండాలని గ్రామ ప్రజలు ఈమెను ఆశీర్వదించారు.




