20-12-2025 12:37:07 AM
బెజ్జూర్, డిసెంబర్ 19 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని తుమ్మలగూడ నూతన గ్రామ సర్పంచ్ కొండ రాంప్రసాద్ను అభినందించిన ఎమ్మెల్సీ దండే విఠల్ అనంతరం ఆయనను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఎమ్మె ల్సీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ మాట్లాడుతూ త్వరలోనే పోడు భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేయడంతో పాటు రూ.50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.