20-12-2025 12:38:05 AM
జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవోలు
కరీంనగర్, డిసెంబరు 19 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లాలో ఇటీవల మూడు దశల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో, అత్యంత సమర్థవంతంగా విజయవంతంగా పూర్తిచేసినందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి టీఎన్జీవోల, టీజీవోల సంఘంల తరఫున పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందుగానే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసి కరీంనగర్ జిల్లాను ముందువరుసలో నిలిపినందుకు జిల్లా యంత్రాంగం చూపిన సమన్వయం ప్ర శంసనీయమని టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, టీజీవోల జిల్లా అధ్యక్షులు, జేఏసీ కన్వీనర్ మడిపెల్లి కాళీ చరణ్ గౌడ్ పేర్కొన్నారు.
ప్రజలకు గానీ, ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు గానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దిగ్విజయంగా ఎన్నికలను నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బందిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంగం లక్ష్మణరావు, అరవింద్ రెడ్డి, గడ్డం సుధాకర్, ముప్పిడి కిరణ్ కుమార్, ఒంటెల రవీందర్ రెడ్డి రాగి శ్రీనివాస్, సర్దార్ అరవింద్ సింగ్, అభినవ రెడ్డి, మహేందర్ రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు కోటా రామస్వామి, శంకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.