01-12-2025 08:02:55 PM
మానకొండూర్ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ స్థానిక సమరంలో నుస్తులాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తుమ్మనపల్లి సంధ్య-శ్రీనివాసరావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ రావు 2012 నుండి 2015 వరకు సర్పంచ్ గా పనిచేశారు. గతంలో తిమ్మాపూర్ మండల ఉపాధ్యక్షుడిగా పని చేశారు. తన సతీమణిని ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్బంగా సతి సమేతంగా దేవాలయంలో పూజలు నిర్వహించారు.