9 May, 2026 | 9:43 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభం

16-01-2025 03:03 AM

*  నెరవేరిన ఇందురువాసుల కల

*  ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్రమంత్రి పీయూష్

*  ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ అర్వింద్

నిజామాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): ఇందూరువాసుల చిరుకాల పసుపు బోర్డు ఆకాంక్ష నెరవేరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి మంగళవారం న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా బోర్డును ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్‌లోని ఓ హోటల్‌లోనూ పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఆధ్వర్యంలో పసుపుబోర్డు ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ పసుపు రైతుల కలను నెరవేర్చినందుకు ప్రధాని మోదీకి ఎంపీ ధర్మపురి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి పండగ కానుకగా పసుపుబోర్డు ఏర్పాటు చేశారన్నారు.

గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, రైతుల సంక్షేమానికి బీజేపీ కృషి చేస్తోందని అర్వింద్ అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఎంపీ అర్వింద్‌కు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేశ్ పటేల్  తదితరులు పాల్గొన్నారు.