26 June, 2026 | 5:36 PM

నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం

09-05-2026 09:11 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానం పైన వర్తక సంఘం ఆధ్వర్యంలో 10 షాపులతో 114 కుటుంబాలు బ్రతుకుతున్నాయని వారి పొట్ట కొట్టవద్దని, నిరుద్యోగులకు దేవస్థానం ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్ మండల పార్టీ  అధ్యక్షుడు కర్రే వెంకటయ్య, పాపట్ల నరేష్ డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ... యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయడం అంటే ఉపాధి పొందుతున్న పేద, మధ్య తరగతి వారి పొట్ట కొట్టడమేనని, కొంతమంది నిరుద్యోగుల పేరిట వర్తక సంఘం రద్దు పేరిట అలజడ సృష్టించారని ఇది మంచి పరిణామం కాదని అన్నారు.

కొండపైన వర్తక సంఘము పునరుద్ధరింపజేస్తూ, స్థానిక  నిరుద్యోగ యువతకు అదనంగా దుకాణాలు వచ్చేలా  లేదా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా దేవస్థానం అధికారులు కృషి చేయాలని అన్నారు.  కొండపైన వర్తక సంఘం ఆధ్వర్యంలో 10 దుకాణాలు నడిపించుకుంటూ  114 షాపుల కిరాయి కడుతూ ప్రత్యక్షంగా, పరోక్షంగా   సుమారు 500 మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు.  ఉన్న ఫలంగా వర్తక  సంఘాన్ని రద్దుచేసి దుకాణాలను రద్దు చేయడం అంటే వారందరినీ రోడ్డున పడేయడమేనని అన్నారు. ఇది సరైన కాదని అన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు ఆరే శ్రీధర్ గౌడ్ , కాంటే కార్ పవన్ కుమార్, ముక్కెర్ల సతీష్ యాదవ్,  అంకం నరసింహ తదితరులు పాల్గొన్నారు.