సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ సహకార పరిమితి సంఘం, ఇందిరా క్రాంతి పథం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉందన్నారు. గ్రేడ్-ఏ రకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ" 2389, సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ" 2369 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.
రైతులు ఎలాంటి మధ్యవర్తుల మోసాలకు గురికాకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకోరావాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తూకం, హమాలి, తరలింపు తదితర అన్ని సౌకర్యాలు కేంద్రంలో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు శ్రమకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావ్ పాటిల్, కడ్పల్ యాదవ్ రెడ్డి, కళ్యాణ్ రావు పటేల్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, విజ్జు పటేల్, మహేశ్వర్ సెట్, శంకరయ్య స్వామి, పిరప్ప మాజీ ఎంపీటీసీ, కృష్ణ, జైరాజ్, కిషోర్, అబ్రార్, అజీమ్, రాజు, తుకారాం పవార్, యూత్ కాంగ్రెస్ నాయకులు, జమీల్, విఠల్, అశోక్, కోలా నర్సింలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సహకార సంఘం ప్రతినిధులు, ఐకెపి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






